తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన వారు నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగులు పడిన అష్టకష్టాలను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. “అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ సాక్షిగా పదేళ్లు నిరుద్యోగులను వంచించిన చరిత్ర మీది కాదా? నాడు నోటిఫికేషన్ల పేరుతో…