Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
- గిరిజన ప్రాంతాల్లో కొత్త జాబ్ కార్డులు
- 18 ఏళ్లు నిండిన వారందరికీ నమోదు
- ఏడాదికి 125 రోజుల ఉపాధి లక్ష్యం
- అమలుపై కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తుతున్న కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి ఉపాధి లేమి ఏర్పడకుండా ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ఈ మేరకు కీలకమైన ఉత్తర్వులు జారీ చేశారు. కష్టకాలంలో గిరిజన కుటుంబాలకు అండగా నిలిచి, ఉపాధి కల్పించడం ద్వారా వలసలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
కొత్త జాబ్ కార్డుల జారీ.. కుటుంబ సభ్యులందరికీ చోటు
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు జాబ్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలను గుర్తించి వెంటనే కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరును ఈ జాబ్ కార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ‘విశ్వకర్మ-గ్రామీణ ఉపాధి హామీ’ (VB-G RAM G) పథకం కింద అర్హులైన ప్రతి ఆదివాసీ, గిరిజన కుటుంబానికి ఏడాదికి 125 రోజులపాటు ఉపాధి కల్పించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- Hyderabad : పండుగ వేళ 'తీపి' విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
- ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
- Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు.. పకడ్బందీ అమలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియతో పాటు, గిరిజనులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశించారు. కరువు పరిస్థితులు ప్రభావం చూపకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలకు పెద్దఎత్తున ఆర్థిక భరోసా లభించనుంది.
తాజావార్తలు
-
Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
-
Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
-
Tiger Shroff : టైగర్ ష్రాఫ్ ‘యాక్షన్’ సీక్రెట్ లీక్.. ఆ గాయాల నుంచి కోతల్లేకుండానే ఎలా కోలుకుంటున్నాడంటే?
-
Scene: దీపావళి బరిలో సూర్య, ‘ఆవేశం’ డైరెక్టర్ సెన్సేషనల్ ‘సీన్’!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!