Telangana : రవాణా శాఖ లో సర్వీసు ఛార్జీలు మోత…
- తెలంగాణ రవాణా శాఖలో సర్వీస్ ఛార్జీల భారీ పెంపు
- లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ రేట్లలో మార్పులు
- ఫిట్నెస్, పర్మిట్ సర్టిఫికెట్లకు కొత్త ధరలు
- వాహన యజమానులపై అదనపు భారం.. ప్రజల్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ రవాణా శాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగి వాహన యజమానులపై అదనపు భారం పడింది. టాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఛార్జీలను గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో చివరిసారిగా సర్వీస్ ఛార్జీలను సవరిస్తే, ఇప్పుడు మళ్లీ పెంపు చేపట్టడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.
కొత్త రేట్ల ప్రకారం, లైసెన్స్ సర్వీస్ చార్జీని ₹200కు, మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్ చార్జీని ₹300కు పెంచారు. నాన్-ట్రాన్స్పోర్ట్ లైసెన్స్‌కు కొత్తగా ₹400 వసూలు చేయనున్నారు. వాహన రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌లో కొనుగోలు ధరపై 0.5% అదనపు ఛార్జీ వసూలు చేయగా, నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలపై 0.1% పెంపు అమలులోకి వచ్చింది. ఆటో రిజిస్ట్రేషన్ ఫీజు ₹250కు చేరగా, మిగతా వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు ₹500కు పెరిగింది.
Also Read
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
HHVM : వీరమల్లును కామెడీ మూవీగా తీయాలనుకున్నాం.. జ్యోతికృష్ణ కామెంట్స్
ఫిట్నెస్ సర్టిఫికెట్ రేట్లు కూడా సవరించబడ్డాయి. త్రీ వీలర్లకు ₹200, మిగతా వాహనాలకు ₹300 వసూలు చేయనున్నారు. అదే విధంగా పర్మిట్ సర్టిఫికెట్ ఫీజులు కూడా పెరిగాయి. త్రీ వీలర్లకు ₹200, మిగతా వాహనాలకు ₹300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పెంపుతో రవాణా శాఖలో సేవలు పొందే వారికి అదనపు వ్యయం తప్పదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహన యజమానులపై ఇప్పటికే ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, టోల్ ఫీజులు వంటి భారం ఉండగా, ఇప్పుడు సర్వీస్ ఛార్జీల పెంపు మరింత భారంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
KINGDOM : నేడు కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు వివరాలు వెల్లడించిన పోలీస్ శాఖ..
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!