Site icon NTV Telugu

Telangana : రవాణా శాఖ లో సర్వీసు ఛార్జీలు మోత…

Telangana

Telangana

Telangana : తెలంగాణ రవాణా శాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగి వాహన యజమానులపై అదనపు భారం పడింది. టాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఛార్జీలను గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో చివరిసారిగా సర్వీస్ ఛార్జీలను సవరిస్తే, ఇప్పుడు మళ్లీ పెంపు చేపట్టడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.

కొత్త రేట్ల ప్రకారం, లైసెన్స్ సర్వీస్ చార్జీని ₹200కు, మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్ చార్జీని ₹300కు పెంచారు. నాన్-ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్‌కు కొత్తగా ₹400 వసూలు చేయనున్నారు. వాహన రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌లో కొనుగోలు ధరపై 0.5% అదనపు ఛార్జీ వసూలు చేయగా, నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై 0.1% పెంపు అమలులోకి వచ్చింది. ఆటో రిజిస్ట్రేషన్ ఫీజు ₹250కు చేరగా, మిగతా వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు ₹500కు పెరిగింది.

HHVM : వీరమల్లును కామెడీ మూవీగా తీయాలనుకున్నాం.. జ్యోతికృష్ణ కామెంట్స్

ఫిట్నెస్ సర్టిఫికెట్ రేట్లు కూడా సవరించబడ్డాయి. త్రీ వీలర్లకు ₹200, మిగతా వాహనాలకు ₹300 వసూలు చేయనున్నారు. అదే విధంగా పర్మిట్ సర్టిఫికెట్ ఫీజులు కూడా పెరిగాయి. త్రీ వీలర్లకు ₹200, మిగతా వాహనాలకు ₹300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పెంపుతో రవాణా శాఖలో సేవలు పొందే వారికి అదనపు వ్యయం తప్పదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహన యజమానులపై ఇప్పటికే ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, టోల్ ఫీజులు వంటి భారం ఉండగా, ఇప్పుడు సర్వీస్ ఛార్జీల పెంపు మరింత భారంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

KINGDOM : నేడు కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు వివరాలు వెల్లడించిన పోలీస్ శాఖ..

Exit mobile version