ఆన్ లైన్ గేమ్ లు మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తాయో నిత్యం వింటూనే ఉన్నాం.. ఆడ, మగ తేడా లేకుండా అందరు ఆన్ లైన్ గేమ్ లకు బానిసలుగా మారుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్ లైన్ గేమ్ బెట్టింగ్ ల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతుంది..పక్కింట్లో ఎవ్వరు లేరని తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం చోరికి పాల్పడింది.. అనుమానంతో పోలీసులు విచారించగ అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ లోనే వెలుగు చూసింది..
రామంతాపూర్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి గోవు కరుణాకర్ రెడ్డి గత నెల 30న ఇంటికి తాళం వేసి..అలవాటుగా తాళం చెవిని అక్కడే ఉండే షేవింగ్ కిట్‌లో పెట్టి బెంగూళూరుకు వెళ్లాడు. ఈ నెల 4న తిరిగి ఇంటికి వచ్చారు. 6వ తేదీన బీరువాలో ఉన్న బంగారు నగలు, కొంత నగదు లేదని గమనించిన కరుణాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి, బీరువాకు వేసిన తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. కానీ ఉండాల్సిన 75 తులాల బంగారంలో 24 తులాల ఆభరణాలు, రూ.ఐదు లక్షల నగదులో నాలుగు లక్షలు మాయం అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. అనుమానం రావడంతో ప్రశ్నించగా అసలు విషయాన్ని బయటపెట్టింది.. కరుణాకర్ రెడ్డికి మూడంతస్తుల భవనం ఉంది. అతని కదలికలను ప్రతిరోజు పక్కంటి పనిమనిషి బొల్ల నిర్మల గమనించేది. నిర్మల కొంత కాలంగా ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడింది. అందుకు డబ్బులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో కరుణాకర్‌రెడ్డి ఇంటికి తాళం వేసి అక్కడే కీ ఉంచిన విషయాన్ని ఆమె గమనించింది. 4వ తేదీ రాత్రి షేవింగ్ కిట్‌లో ఉన్న తాళం చెవిని తీసుకుంది. ఇంట్లోకి ప్రవేశించి బెడ్ వద్ద వెతకగా..బీరువా కీ కూడా లభించడంతో పని సులువు అయ్యింది. బీరువాలో ఉన్న ఆభరణాలు మూడు మూటల్లో ఉండటంతో తెలివిగా మూడింటిలో నుంచి కొన్ని కొన్ని తీసుకుంది.. అలాగే నగదును కూడా తీసుకున్నట్లు నేరం అంగీకరించింది.. నగదు, బంగారాన్ని పోలీసులకు అప్పగించిందింది..