Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో డ్రైవర్లు, కండక్టర్లు విధులకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ డిపోలో టికెట్లు ఇచ్చేవారు లేక పురుషులు కూడా ఉచితంగా ప్రయాణించే అరుదైన పరిస్థితి కనిపిస్తోంది.
కరీంనగర్ డిపోలో ప్రస్తుత పరిస్థితి..
Also Read
సాధారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం కింద కేవలం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. కానీ.. ప్రస్తుత సమ్మె కారణంగా కరీంనగర్ డిపో నుంచి నడిచే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పరిస్థితి తలకిందులైంది. రెగ్యులర్ డ్రైవర్లు సమ్మెలో ఉండటంతో అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో హైర్ బస్సులు నడుపుతున్నారు. బస్సులను రోడ్లపైకి తెచ్చినప్పటికీ, టికెట్లు జారీ చేసే కండక్టర్లు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్లు ఇచ్చే నాథుడు లేకపోవడంతో.. మహిళలతో పాటు పురుషులు కూడా పైసా ఖర్చు లేకుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ బస్సుల మినహాయింపు..
అన్ని బస్సుల్లో ఇదే పరిస్థితి ఉందనుకుంటే పొరపాటే. కరీంనగర్ నుంచి నడిచే ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రం పాత పద్ధతిలోనే వసూళ్లు సాగుతున్నాయి. ఈ బస్సుల్లో డ్రైవర్లే స్వయంగా టిమ్ (TIM) మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. దీనివల్ల ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించే పురుషులు మాత్రం టికెట్ ధర చెల్లించాల్సి వస్తోంది.
సమ్మె కారణంగా ఆర్టీసీకి భారీగా ఆదాయ గండి పడుతోంది. ఒకవైపు ప్రైవేట్ డ్రైవర్లకు చెల్లింపులు చేస్తూ, మరోవైపు ప్రయాణికుల నుంచి టికెట్ నగదు వసూలు చేయలేకపోవడం సంస్థకు భారంగా మారింది. ఈ గందరగోళం తొలగి రవాణా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలంటే ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య త్వరగా ఒప్పందం కుదరాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!