Site icon NTV Telugu

T-Safe : తెలంగాణ పోలీసుల ముందడుగు.. మహిళా భద్రతకు ‘టీ-సేఫ్’ విప్లవాత్మక విధానం

Tsdgp

Tsdgp

తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు, ముఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మక ముందడుగు అని తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఇటీవల జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్‌లో ‘టీ-సేఫ్ – మహిళల కోసం సురక్షిత ప్రయాణం’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చి, ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క విశిష్టతను వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2022 ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా శ్రామిక మహిళల శాతం తెలంగాణలోనే ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో మహిళల ప్రయాణాన్ని అత్యంత సురక్షితం చేయాలనే లక్ష్యంతో 2024లో ‘టీ-సేఫ్’ యాప్‌ను ప్రారంభించినట్లు డిజిపి వెల్లడించారు. ఇప్పటివరకు మహిళా భద్రత కోసం ఉన్న సౌకర్యాలు కేవలం అత్యవసర ప్రతిస్పందన కోసం మాత్రమే పనిచేస్తుండగా, ‘టీ-సేఫ్’ మాత్రం ప్రయాణం మొదలైనప్పటి నుంచే పర్యవేక్షణ ప్రారంభిస్తుంది.

ఈ విధంగా, ఇది కేవలం ‘ప్రతిస్పందించే విధానానికి బదులుగా, ‘ముందస్తు నివారణ’ విధానంలో పనిచేయడం దీని ప్రధాన ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.’ట్రావెల్-సేఫ్’ లేదా ‘టీ-సేఫ్’ యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి దీనికి స్మార్ట్ ఫోన్ అవసరం లేకపోవడం. ఇందులో ఆటోమేటెడ్ రైడ్ ట్రాకింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది రూట్ డివియేషన్స్ చేరుకోవాల్సిన అంచనా సమయం ఆలస్యం, వెరిఫికేషన్ కాల్‌కు సమాధానం ఇవ్వకపోవడం, ప్రయాణం ఎక్కువ సమయం తీసుకోవడం, తప్పు పాస్‌కోడ్‌ను నొక్కడం వంటి 42 రకాల డివియేషన్స్ గుర్తించగలదు. ఈ ఫీచర్ మొదలైనప్పుడు సమీపంలోని వ్యాన్లు లేదా పోలీస్ పెట్రోల్ మోటార్‌సైకిళ్లు తక్షణమే బాధితురాలి ప్రదేశానికి చేరుకుంటాయని ఆయన తెలిపారు. ఈ సదుపాయానికి మహిళల నుంచి 5 కు గాను 4.7 రేటింగ్ లభించిందని ,ఈ విషయంలో ఇప్పటికే 350కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని డిజిపి తెలియజేశారు.

Jio Annual Plan: డైలీ 2.5GB డేటా, ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్.. జియో చౌకైన వార్షిక ప్లాన్

భవిష్యత్తులో రాష్ట్రంలోని ఉబర్, ఓలా, రాపిడో , మేరు, అభిబస్, వంటి అన్ని క్యాబ్ అగ్రిగేటర్‌లతో టీ-సేఫ్‌ను సమగ్రపరచాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా, కృత్రిమ మేధ ఉపయోగించి మహిళా భద్రతకు బలహీన ప్రాంతాలను గుర్తించిన తర్వాత ఆటోమేటెడ్ సేఫ్టీ చెక్ కాల్స్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఏదైనా ప్రమాదాన్ని గుర్తించడానికి, మహిళకు ప్రమాదం ఉన్నట్లు సంకేతాలను అందించే వాయిస్ రికగ్నిషన్‌ను కూడా AI ద్వారా అమలు చేయాలని ప్రతిపాదించారు. ప్రమాదాలను గుర్తించడానికి ఎప్పటికప్పుడు డ్రోన్ మరియు సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ మరియు విశ్లేషణ చేయబడుతుందని ఆయన వివరించారు.

డిజిపి తన ప్రజెంటేషన్‌లో విజన్ 2047 నాటికి పోలీసు విభాగంలో మహిళల నిష్పత్తిని 50% వరకు పెంచాలని, మరియు పోలీస్ శాఖలో పనిచేసే మహిళలకు అనుగుణంగా తయారు చేయాలని ప్రతిపాదించారు. సామాజిక అవగాహన కోసం, ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి తో కలిసి తెలంగాణా పోలీసులు క్లాస్ 1 నుండి క్లాస్ 10 వరకు సిలబస్‌లో మార్పులు చేసి, లింగ-తటస్థ కథనాలను చేర్చినట్లు తెలిపారు. అలాగే, తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’ను ఏడు జిల్లాల్లో ప్రారంభించింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణకు సంబంధించిన పోలీసుల మొదటి ఉమ్మడి చొరవగా ‘సాహస్ ‘ కార్యక్రమం ద్వారా కార్పొరేట్ సంస్థలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటుకు శిక్షణ ఇస్తున్నట్లు డిజిపి వివరించారు.

గ్రామ స్థాయిలో డిజిటల్ అక్షరాస్యత పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాలను మహిళలకు సురక్షితంగా మార్చడం, షి టీమ్‌ల ద్వారా అవగాహన కల్పించడం మరియు నేరస్తులకు కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని బి. శివధర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యత మరియు సాంకేతికత వినియోగంపై ఉన్న సంకల్పం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ రకమైన అప్ లను రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రారంభిస్తే బాగుంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.

Sridhar Babu : HILT పాలసీపై శ్రీధర్ బాబు కౌంటర్

Exit mobile version