NTV Telugu Site icon

Harish Rao: సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు

Harish Rao

Harish Rao

Harish Rao: సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. . మన సిద్దిపేట జిల్లా సైతం ఎన్నో కీర్తికిరీటాలను సొంతం చేసుకుందని తెలిపారు. సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.క్యాంపు కార్యాలయంలో మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులను స్మరిస్తూపానికి మంత్రి నివాళులు అర్పించారు. 14 గేళ్ల పోరాటం, తొమ్మిదేళ్ల సంకల్పంతో నేడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని మంత్రి హరీష్ అన్నారు.

Read also: Talasani Srinivas: 70 ఏండ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్ళలో జరిగింది

జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం అంటూ తొమ్మిది సంవత్సరాల ప్రగతియాత్రను పూర్తిచేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామన్నారు. పసి రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే తెలంగాణలో నూరేళ్ల అభివృద్ధిని సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉందన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికే దశ, దిశ నిర్దేశించేలా ఉన్నాయని మంత్రి హరీష్ రావ్‌ అన్నారు. సర్వతోముఖాభివృద్ధిగా నిలిచింది.. ఇది మనమంతా గర్వపడాల్సిన సందర్భమన్నారు మంత్రి. సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుందన్నారు. మన సిద్దిపేట జిల్లా సైతం ఎన్నో కీర్తికిరీటాలను సొంతం చేసుకుందని తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి అచేతనావస్థలు… ఇప్పటి అద్భుతమైన స్థితిగతులను మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు.
Twitter Ella Irwin : ట్విట్టర్‌ నుంచి వైదొలగిన ఎల్లా ఇర్విన్‌..

Show comments