Site icon NTV Telugu

TG SSC : మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం..?

10th Class Exams

10th Class Exams

TG SSC : తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే సంవత్సరం మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి. పరీక్షల తేదీల ఖరారుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈసారి పరీక్షల షెడ్యూల్‌లో ప్రతి సబ్జెక్టుకు మధ్య ఒకటి లేదా రెండు రోజుల విరామం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం అధికారులు రెండు నుంచి మూడు ప్రత్యామ్నాయ షెడ్యూళ్లను సిద్ధం చేస్తున్నందున అధికారిక ప్రకటన కొద్దిగా ఆలస్యమవుతోంది.

Telangana : సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందా?

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో కూడా ఒక్కో పరీక్షకు ఎక్కువ విరామం ఇచ్చే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో పరీక్షల మధ్య వారం రోజుల గ్యాప్‌ కూడా వస్తుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా, ఇలాంటి నమూనాను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో కొన్ని పేపర్ల మధ్య ఒక్కరోజు కూడా విరామం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల మధ్య విరామం ఇవ్వాలని నిపుణులు సైతం సిఫార్సు చేస్తున్నారు.

అయితే పరీక్షల వ్యవధిని పెంచితే విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువవుతుందని కొందరు భావిస్తుండగా, మరోవైపు ఒకటి రెండు రోజుల విరామం ఇవ్వడం వల్ల పునర్విమర్శకు సమయం దొరకడంతో ఒత్తిడి తగ్గుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీబీఎస్‌ఈ తరహాలో కాకపోయినా, కనీసం ఒకటి రెండు రోజుల విరామం ఇవ్వడం సరైనదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమంటే, సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలను ఒకేసారి నిర్వహిస్తోంది. ఆప్షనల్ సబ్జెక్టుల కారణంగా పేపర్ల మధ్య సహజంగానే ఎక్కువ వ్యవధి వస్తోంది. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ సెప్టెంబర్ 24న విడుదలైన విషయం తెలిసిందే.

TV Offer: వర్త్ వర్మ వర్త్.. TCL 55 అంగుళాల టీవీపై ఏకంగా రూ.48000 డిస్కౌంట్..!

Exit mobile version