Site icon NTV Telugu

స్పీకర్‌ పోచారం గల్లీ క్రికెట్‌.. 3 బంతుల్లో 2 సిక్స్‌లు

Pocharam

Pocharam

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. గల్లీ క్రికెటర్‌గా మారిపోయారు.. ఓ గల్లీలో క్రికెట్‌ ఆడుతున్న చిన్నారులను చూసి కారు దిగిన ఆయన.. వెంటనే బ్యాట్‌ అందుకుని సిక్స్‌లు బాదేశారు… పిల్లలతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తన స్వగ్రామం పోచారం నుంచి బాన్సువాడకు వెళ్లున్న స్పీకర్ శ్రీనివాస్‌ రెడ్డికి.. మార్గం మధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులు కనిపించారు.. తన కాన్వాయ్‌ ఆపి.. పిల్లలను పలకరించిన స్పీకర్.. ఆ తర్వాత క్రికెటర్‌ అవతారం ఎత్తారు.. సరదాగా చిన్నారులతో బ్యాటింగ్‌కు దిగారు.. ఇక, బ్యాటింగ్ చేసిన స్పీకర్ పోచారం మూడు బంతులను ఎదుర్కొని అందులో రెండు సిక్స్‌లుగా మలిచారు.. కాసేపు అన్ని టెన్షన్‌లు మరిచి.. చిన్నారులతో సంతోషంగా గడిపారు.

Exit mobile version