Komatireddy Venakt Reddy : తెలంగాణలో మౌలిక వసతుల రంగంలో ఎన్నడూ లేని భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ రహదారి ప్రాజెక్టులకు మొత్తం రూ.60,799 కోట్లు మంజూరు కావడం తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద రికార్డని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారుల ప్రధాన కేంద్రంగా మార్చే దిశగా రహదారి నిర్మాణాలు కీలకంగా నిలుస్తాయని కోమటిరెడ్డి చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షితమవుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు.
ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగా రూ.10,400 కోట్లతో హైదరాబాద్–విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరించనున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రతిష్ఠాత్మక RRR ప్రాజెక్టుకు రూ.36,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు లేని చోట కొత్త రోడ్లు, సింగిల్ రోడ్లను డబుల్ లైన్లుగా మార్చే పనులు వేగవంతం చేయనున్నారు. HAM ప్రాజెక్ట్ కోసం రూ.11,399 కోట్లు ఖర్చు చేస్తామని, త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు.
ఇవే కాకుండా మన్ననూరు-శ్రీశైలం మధ్య 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌కి రూ.8,000 కోట్లు కేటాయించారు. దేశంలోనే కొత్త గుర్తింపునిచ్చే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూ.20,000 కోట్లు ప్రతిపాదించారు. ఈ రహదారి పూర్తికాగానే తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి పద్దెనిమిది రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. తమ రాజకీయ జీవితం లో ఇంత పెద్ద అవకాశం దక్కడం గర్వకారణమని, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
NPCIL Recruitment 2025: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో జాబ్స్.. మిస్ చేసుకోకండి
