Sridhar Babu : 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ మా లక్ష్యం
- 2037 వరకు తెలంగాణ 1 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా లక్ష్యం
- 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా తుది లక్ష్యం
- దాంట్లో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పాలసీ రూపొందిస్తున్నాం
- సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఉండేలా ప్రణాళిక. -మంత్రి శ్రీధర్‌బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా, ఈ విజన్ పాలసీ లక్ష్యాలు, ప్రణాళికలపై ఆయన కీలక వివరాలను వెల్లడించారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. “తెలంగాణను 2037 వరకు 1 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా తక్షణ లక్ష్యం. అలాగే, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే మా తుది లక్ష్యం. ఈ లక్ష్యాలను సాధించేందుకు వీలుగానే మేము తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పాలసీని రూపొందిస్తున్నాం,” అని స్పష్టం చేశారు. ఈ ప్రణాళికలో ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఉండేలా చూస్తున్నామని, వాటి మధ్య సమతుల్యతను కొనసాగించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.
Also Read
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ఈ విజన్ డాక్యుమెంట్ నాలుగు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినదని పేర్కొంటూ, దాని రూపకల్పనలో విస్తృత ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. దాదాపు 4 లక్షల మంది ప్రజల సూచనలు, ముఖ్యంగా యువకుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నామని ఆయన చెప్పారు. అంతేకాకుండా, అన్ని రంగాల్లోని మేధావులు, నిపుణులతో ఇప్పటివరకు దాదాపు 70 సమావేశాలు ఏర్పాటు చేశామని, అందరి అభిప్రాయాలను తీసుకున్న తరువాతే విజన్ డాక్యుమెంట్‌ను తుది రూపు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
మూడు ట్రిలియన్ ఎకానమీని ఎలా సాధ్యం చేయాలి అనే అంశాలపై ఇప్పటికే తమ బృందం విస్తృత కసరత్తు చేసిందని ఆయన వివరించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌లో అధికారికంగా ఆవిష్కరించనున్నట్టు మంత్రి తెలిపారు. పెట్టుబడులతో పాటు, కీలకమైన సలహాలు ఇవ్వడానికి చాలా మంది పారిశ్రామిక వేత్తలు ఈ గ్లోబల్ సమ్మిట్‌కి వస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు.
తాజావార్తలు
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!