Telangana Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుల కలకలం.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే కార్డు రద్దవుతుందా.?
- IT రిటర్న్స్‌తో రేషన్ కార్డులపై భయం
- గ్రామాల్లో అధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు
- టాక్స్ పేయర్ vs IT ఫైలర్ గందరగోళం
- ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ప్రస్తుతం ఒక కొత్త భయం పట్టుకుంది. ఆదాయపన్ను రిటర్న్స్ (IT Returns) దాఖలు చేసిన వారి రేషన్ కార్డులు రద్దు కానున్నాయనే ప్రచారం గ్రామాల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా ఉన్న రేషన్ కార్డు ఎక్కడ చేజారిపోతుందోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామ పరిపాలన అధికారులు (GPOలు) నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి విచారణ చేస్తుండటంతో ఈ ప్రచారం మరింత వేగవంతమైంది. ముఖ్యంగా వార్షికాదాయం రూ. 6 లక్షల కంటే ఎక్కువ చూపించి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి వివరాలను ఆదాయపన్ను శాఖ నుంచి సేకరించిన అధికారులు, వారి అర్హతపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 30,186 మంది, సిద్దిపేట జిల్లాలో 14,200 మందిపై ఈ విచారణ జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉంది.
Also Read
Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్..
రేషన్ కార్డు కేవలం బియ్యం కోసమే కాకుండా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి కీలక సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా మారింది. ఒకవేళ కార్డు రద్దయితే ఈ పథకాలన్నీ నిలిచిపోతాయనే భయం ప్రజల్లో నెలకొంది. అయితే, ఆదాయపన్ను చెల్లించే వారికి (Tax Payers), కేవలం రిటర్న్స్ దాఖలు చేసే వారికి (IT Filers) మధ్య చాలా తేడా ఉంటుంది. చాలామంది చిన్న వ్యాపారులు బ్యాంక్ రుణాలు పొందడం కోసమో లేదా డిజిటల్ లావాదేవీల ద్వారా కట్ అయిన TDS రీఫండ్ క్లెయిమ్ చేయడం కోసమో తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటారు. ఇప్పుడు విచారణ పేరుతో తమ కార్డులు ఎక్కడ తొలగిస్తారోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..
రేషన్ కార్డుల రద్దుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగానే ఈ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో సేకరించిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అర్హులైన పేదలకు అన్యాయం జరగకుండా, కేవలం అక్రమంగా కార్డులు పొందిన వారిని మాత్రమే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ చేసిన ప్రతి ఒక్కరినీ అనర్హులుగా ముద్ర వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!