NTV Telugu Site icon

TRS Foundation Day: ఆసక్తికరంగా మారిన టీఆర్ఎస్‌ రాజకీయ తీర్మానం..!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరపనున్నారు. పార్టీ 22వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర మండలస్థాయి ప్రతినిధులకు ఆహ్వానం ఉంటుంది. ఇటు ప్రత్యేక ఆహ్వానితులుగా.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు.

Read Also: COVID 19: కరోనాకు కొత్త మందు.. స్ప్రేతో వైరస్‌ ఖ‌తం..!

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 11 తీర్మానలపై చర్చించి ఆమోదిస్తారు. బీజేపీపై పొరు మొదలుపెట్టడం… జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించేందుకు కేసీఆర్ సిద్ధం కావడంతో… సమావేశంలో చేసే రాజకీయ తీర్మానంపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో చేసే రాజకీయ తీర్మానంతో టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు రాజకీయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది . 11 తీర్మానాలపై చర్చించి ఆమోదించిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఆవిర్భావ సభ ముగియనుంది.. ఇప్పటికే కేంద్రంపై యుద్ధం ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తాం అంటున్నారు.. కొన్ని రాష్ట్రాల సీఎంలను కలసి చర్చలు కూడా జరిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో.. రాజకీయ తీర్మానం ఎలా ఉంటుంది.. అనేది ఆసక్తికరంగా మారింది.