Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇదే అల్పపీడనం పశ్చిమ-వాయువ్య-పశ్చిమ దిశగా పయనించి ఈశాన్య మధ్యప్రదేశ్‌ను దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి, కరీంగర్, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Read also: Sravana Naga Chaturthi: నాగేంద్రునికి పుష్పార్చన స్తోత్ర పారాయణం చేయండి
రాత్రి నుంచి మొదలైన సరదా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువన మహారాష్ట్ర నుంచి వరద వస్తుండటంతో అధికారులు స్వర్ణ ప్రాజెక్టు 2 గేట్లు, గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఒక గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నక్కలవాడ, బోథ్ కాండ్రె వాగు, కోట వాగు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రానున్న మూడు రోజుల్లో గుంటూరు, బాపట్ల, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ATM Robbery: ఏటీఎంలోని డబ్బును చోరీకి యత్నించి.. షాక్‌కు గురైన దొంగలు!