Telangana Rains: రెండు రోజుల క్రితం తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వరకు సముద్ర మట్టానికి 3.1-5.8 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు, రేపు (ఆదివారం) 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. నేడు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు జిల్లాల్లో 115.6 – 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరో ఏడు జిల్లాల్లో 64.5 – 115.5 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read also: PM Modi: మోడీ పాదాలకు నమస్కరించిన హాలీవుడ్ సింగర్.. వీడియో చూడండి..
నైరుతి రుతుపవనాలు ఆదిలాబాద్ జిల్లాలోని కొంతభాగంతో పాటు మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు విస్తరించాలని చెప్పారు. ఆదివారం నాటికి తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు వివిధ జిల్లాల్లో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో శుక్రవారం అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు స్పందన బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఇదిలా ఉండగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలకరి పలకరించి సాగుకు సిద్ధమవుతున్నారు. గతేడాదితో పోలిస్తే.. రుతుపవనాల రాక ఆలస్యమైనా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Film Nagar Crime: ఫిల్మ్ నగర్‌లో విషాదం.. నాగేళ్ల కుమారున్ని ఉరివేసిన తల్లి.. ఆతరువాత!