Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం
- కూరగాయల సాగు లక్ష ఎకరాలకు పెంపు
- ఆయిల్‌పామ్ ధరలపై ప్రత్యేక కమిటీ
- కొత్త కేవీకేలు, సీడ్ బిల్లుపై కేంద్రానికి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఏకంగా 36 శాతం వృద్ధి నమోదై, పప్పుధాన్యాల సాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ రబీ సదస్సులో పాల్గొన్న ఆయన, తెలంగాణ వ్యవసాయ రంగ ప్రగతిని వివరించడంతో పాటు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి తీసుకెళ్లారు.
పంటల వైవిధ్యీకరణ.. కూరగాయల సాగు లక్ష్యం లక్ష ఎకరాలకు పెంపు
ఎల్‌నినో ప్రభావం, వర్షపాతంలో వస్తున్న విపరీత మార్పులు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులను తట్టుకునేలా తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటల సరళిని మార్చుకోవడంతోనే పప్పుధాన్యాల సాగులో ఈ స్థాయిలో వృద్ధి సాధ్యమైందన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల సాగు విస్తీర్ణాన్ని ప్రస్తుతం ఉన్న 8,800 ఎకరాల నుంచి ఏకంగా లక్ష ఎకరాలకు పెంచాలని నిర్ణయించామని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
Also Read
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
కరువు మండలాలకు ప్రత్యేక సాయం.. ఆయిల్‌పామ్ ధరలపై కేంద్రం హామీ
తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్న మండలాలకు సూక్ష్మ సాగునీరు, నీటి సంరక్షణ నిర్మాణాల కోసం ప్రత్యేక కేంద్ర సాయం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా మొక్కజొన్న, జొన్న పంటలను కూడా ధరల మద్దతు పథకం (PSS) పరిధిలోకి తీసుకురావాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు విస్తరించి, 72 వేల మంది కొత్త రైతులు ఈ రంగంలోకి వచ్చారని గుర్తుచేశారు. ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర లభించాలంటే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని పాత పద్ధతిలోనే 44 శాతానికి పునరుద్ధరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, ఆయిల్‌పామ్ ధరల సమస్యలపై పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
సాటిలైట్ సాయిల్ హెల్త్ టెక్నాలజీ.. కొడంగల్ ప్రాజెక్టులకు కేంద్ర మద్దతు
రైతులకు వేగంగా, రియల్‌టైమ్‌లో నేల ఆరోగ్య వివరాలు అందించేందుకు వీలుగా ‘శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీ’ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రానికి మంత్రి సూచించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, అదనంగా మరో 16 కేవీకే (KVK)లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు పంట నష్టాల సమయంలో రైతులకు నష్టపరిహారం చెల్లించేలా కఠిన నిబంధనలతో కొత్త సీడ్ బిల్లును త్వరగా తీసుకురావాలని కోరారు. కొడంగల్‌లో ప్రతిపాదించిన అగ్రి బిజినెస్ పార్క్, సెమీ-అరిడ్ హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌లకు కేంద్రం తక్షణమే అవసరమైన సహకారాన్ని అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!