Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- పులిచింతల పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన భట్టి విక్రమార్క
- రాష్ట్రంలో సరికొత్త రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
- ఎల్‌నినో ప్రభావంతో 4 వేల మెగావాట్ల జలవిద్యుత్ తగ్గుదల
- విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్న సంస్థలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లాలోని పులిచింతల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఇప్పటివరకు జరిగిన విద్యుత్ ఉత్పత్తి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనిట్ కంట్రోల్ రూమ్‌ను స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం, ప్రాజెక్టు నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి తీరుపై అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు.
20 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగి సరికొత్త రికార్డులను తాకుతోందని తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ (పీక్ డిమాండ్) 15,000 మెగావాట్లుగా ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా 20,000 మెగావాట్లకు చేరుకుందని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జల విద్యుత్ ఉత్పత్తి సుమారు 4,000 మెగావాట్ల మేర తగ్గిందని, పెరిగిన డిమాండ్ , తగ్గిన ఉత్పత్తిని కలిపి విద్యుత్ వ్యవస్థపై మొత్తంగా 8,000 మెగావాట్ల అదనపు భారం పడిందని వివరించారు.
Also Read
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
అదనపు భారమైనా నిరంతర సరఫరా.. విద్యుత్ సంస్థల సమర్థత
వ్యవస్థపై ఇంతటి భారీ భారం పడినప్పటికీ, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సమర్థవంతంగా నిర్వహణ సాగిస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా గృహ వినియోగదారులకు 24 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్‌ను సమకూర్చుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని భట్టి విక్రమార్క అభినందించారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!