NTV Telugu Site icon

Telangana Police: కచ్చితంగా ఉండాల్సిందే.. బైక్‌ కొనేవారికి పోలీసులు కొత్తరూల్స్‌

Telangana Police

Telangana Police

Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాలు కాగా, మరికొన్ని నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయి. ఈ నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో ద్విచక్రవాహనాలే ఎక్కువగా జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తం ప్రమాదాల్లో 53 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకురానుంది. కొత్త బైక్ కొనుగోలు చేసే సమయంలో వాహనదారులు రెండు హెల్మెట్‌లు కొనుగోలు చేసేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో బైక్ ప్రమాదాల మృతుల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్న పోలీసు అధికారులు.

Read also: Fevikwik Treatment: ఇదొక కొత్త ట్రీట్ మెంట్.. కుట్లకు బదులు చిన్నారికి ఫెవిక్విక్‌తో వైద్యం

వాహన నడిపేవారే కాదు.. వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించేలా చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉండగా.. ప్రతి వాహనదారుడు బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు హెల్మెట్ ధరించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో ప్రతి గంటకు ఒక రోడ్డు ప్రమాదంలో మరణాలు సంభవిస్తుండగా, బైక్‌లు ఎక్కి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ. గతేడాది 21,619 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 7,559 మంది మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇందులో 10,653 బైక్ ప్రమాదాలు జరగగా, 3,977 మంది మరణించారు. వీరిలో మూడొంతుల మంది తలకు గాయాలై మరణించారని వాహనదారులు, వెనుక కూర్చున్న వారు తెలిపారు.

హెల్మెట్ ధరించడం వల్ల మరణాల రేటు తగ్గుతుందని, స్వల్ప గాయాలతో బతికే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే రైడర్లు, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. అయితే ప్రస్తుతం ఇది పాక్షికంగా మాత్రమే అమలవుతోంది. ప్రతి ద్విచక్ర వాహనదారుడు రెండు హెల్మెట్‌లు కలిగి ఉంటే.. ఏదో ఒకవిధంగా వెనుక కూర్చున్న వారు కూడా వాటిని ధరిస్తారని అధికారులు భావించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు హెల్మెట్‌లు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, అవసరమైతే రోడ్డు రవాణా నిబంధనలలో మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే ప్రభుత్వానికి పంపాలని పోలీసు శాఖ యోచిస్తోంది.
Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం