Site icon NTV Telugu

Food Safety: పిజ్జా ప్రియులకు షాక్.. ఇది చూస్తే జన్మలో పిజ్జా ముట్టరు..!

Pizza

Pizza

Food Safety: రోజు రోజుకు హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ ఉత్త మాటలుగా మారింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిజ్జా ప్రియులకు కొదువ లేదు. కానీ తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలతో పిజ్జా హౌస్‌లను షాక్ చేశారు. తెలంగాణలో 55 పిజ్జా సెంటర్లను.. అందులో పిజ్జాహట్, డోమినోస్, పిజ్జా ప్యారడైస్ స్టోర్ లను తనిఖీ చేశారు. ఈ తనిఖీలు వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో జరిగాయి.

మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

తనిఖీలలో ఏ చోటా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించబడడం లేదని తేలింది. కాలం ముగిసిన సాస్‌లు, ఎక్స్‌పైరీ డేట్ లేని సాస్‌లు వాడుతున్నట్లు, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని సిబ్బంది పిజ్జాలు, బర్గర్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మొలకెత్తిన బంగాళదుంపలతో క్రిమికీటకాల మధ్యే తయారీ జరుగుతుందని కూడా వెల్లడైంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దీన్ని అత్యంత అసురక్షితంగా, గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. కొందరు సిబ్బందిపై కేసులు నమోదు చేయబడ్డాయి, మరికొందరికి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి.

Sogasu Choodatarama: సిద్ధు జొన్నలగడ్డ కోసం రంగంలోకి నయనతార

Exit mobile version