NTV Telugu Site icon

కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్‌లోనా? ఫామ్‌హౌస్‌లోనా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్‌రావు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాఘవ.. దౌర్జన్యాలు, కీచక పర్వాలు.. సెల్ఫీ వీడియోతో బయటపెట్టాడు రామకృష్ణ.. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకునే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది.. అయితే, ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు..

Read Also: కరోనా కల్లోలం.. భారత్‌లో లక్ష దాటేసిన రోజువారి కేసులు..

కీచక రాఘవ ఎక్కడ..? ప్రగతిభవన్‌లోనా..? ఫామ్‌హౌస్‌లోనా? అంటూ ట్వీట్ చేశారు.. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్ట్ చేసే పోలీసులు.. మానవమృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడమేంటని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి.. ఆ దుర్మార్గుడిని కాపాడుతున్న అదృష్ట శక్తి ఎవరు..? ఇంత దారుణ ఘటనపై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.