Site icon NTV Telugu

Ministers: తెలంగాణ నవజాత శిశువు.. గొంతు నులిమేందుకు కేంద్రం కుట్ర..!

Y Sathish Reddy

Y Sathish Reddy

డబుల్ ఇంజన్లతో వైశ్యమ్యాల చిచ్చు పెడుతున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్… రెడ్ కో చైర్మన్‌గా స‌తీష్‌ రెడ్డి ప‌ద‌వీ ప్రమాణ స్వీకారోత్సవానికా హాజరైన మంత్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ… అధికారం అప్పగిస్తే దేశాన్ని ప్రమాదంలో పడేశారని ఫైర్‌ అయ్యారు.. వాట్సాప్ యూనివర్సిటీ కేంద్రంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన మంత్రులు.. గుజరాత్ నమూనాతో భారతీయ జనతా పార్టీ నయ వంచన చేస్తోందన్నారు.. దేశాన్ని నరేంద్ర మోడీ సర్కార్‌ చీకట్లోకి నెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణ నవజాత శిశువు.. కానీ, గొంతు నులిమేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ మంత్రులు.

Read Also: Andhra Pradesh: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు

మరోవైపు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి సీఎం కేసీఆర్‌ తప్పనిసరిగా గుర్తింపు ఇస్తున్నారని.. రెడ్కో చైర్మన్‌గా సతీష్ రెడ్డి నియామకం అందులో భాగమే అన్నారు మంత్రులు.. అవ‌స‌రాల‌ను బ‌ట్టి అంద‌రికీ అవ‌కాశాలు ఉంటాయని.. టీఆర్ఎస్‌ ది శత్రుదుర్బేద్యమైన కోటగా అభివర్ణించారు.. నిర్మాణాత్మకమైన పార్టీగా ప్రజల ఆదరణ పొందుతోన్న పార్టీ టీఆర్ఎస్‌గా పేర్కొన్నారు.. సభ్యత్వ నమోదు కోసం ప్రజలు బారులు తీరుతున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనమే అందుకు కారణంగా తెలిపారు.. బీజేపీ అస‌త్యాలు ప్రచారం చేస్తోందని.. మోడీది అబద్దాల పాలనగా విమర్శించారు.. తెలంగాణ మోడల్‌ దేశంలో ఎక్కడుందో చూపండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్‌ విసిరారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్.

Exit mobile version