NTV Telugu Site icon

Talasani : గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు.. ఏది పడితే అది మాట్లాడొద్దు..!

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

తెలంగాణలో గవర్నర్‌, ప్రభుత్వం మధ్య గ్యాప్‌ పెరుగుతూ పోతోంది.. గవర్నర్‌ తమిళిసై మీడియాతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తనకు అవమానం జరిగిందంటూ వ్యాఖ్యలు చేయడం లాంటి ఘటనలు దూరం పెంచుతూ పోతున్నాయి.. ఇదే సమయంలో గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని.. అధికార టీఆర్ఎస్‌ పార్టీపై ఫైర్‌ అవుతున్నాయి విపక్షాలు. అయితే, గవర్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మాది.. నామినేటెడ్ వ్యక్తులం కాదన్నారు.. గవర్నర్‌ రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదు.. ఈ ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదు అని చెప్పటం సరికాదని హితవుపలికారు.

Read Also: Troubles to TRS: అధికార పార్టీకి తలనొప్పులు..! ఇబ్బందిగా ఆ మూడు ఘటనలు..!

ఇక, ఏది పడితే అది గవర్నర్‌ మాట్లాడడం కరెక్ట్‌ కాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. రాజకీయపరమైన మాటలు గవర్నర్‌ మాట్లాడుతున్నారన్న ఆయన.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదని.. ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే రోల్ చాలా తక్కువ అన్నారు. గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయని అన్నారని గుర్తుచేశారు.. అది కూడా గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. మరోవైపు, రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? అని ప్రశ్నించారు.. ప్రతిపక్షాలకు పని పాట లేదని ఫైర్‌ అయిన ఆయన.. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తప్ప వేరే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్.