తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఆర్మీకి, సైనికులకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్నటి సీఎం కేసీఆర్ కామెంట్స్ పై కేంద్ర మంత్రులు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. జీవిత కాలం హిందూస్థాన్, పాకిస్థాన్.. అంతేనా అంటూ నిలదీసిన ఆయన.. పుల్వామా సర్జికల్ స్ట్రెక్స్ ని రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాఫెల్‌లో అవినీతి జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేసిన ఆయన.. దానికి ఆర్మీకి, సైనికులకు సంబంధం ఏంటి? అని నిలదీశారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యుద్ధం చేస్తావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో అని హెచ్చరించారు తలసాని.
Read Also: Peddireddy: అది బాబు కుట్రే..! బీజేపీలోని టీడీపీ నేతల ద్వారా చేయించారు..!
ఇక, హైదరాబాద్‌లో వరదలు వస్తే కిషన్‌రెడ్డి ప్రొటోకాల్ లేదని పొలిటికల్ డ్రామా చేశారని విమర్శించారు తలసాని.. మా ముందు మీ శక్తి ఎంత? సికింద్రాబాద్ ప్రజలు కిషన్ రెడ్డిని తిట్టిపోస్తున్నారన్న ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయమంటే కిషన్ రెడ్డి పారిపోయారని దుయ్యబట్టారు.. తెలంగాణ దయాదాక్షణాలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందన్న తలసాని శ్రీనివాస్ యాదవ్.. మరోవైపు, ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కం ఠాకూర్ పిచ్చోడిలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు.
