KTR on Development: కేటీఆర్ సెటైర్లు.. అక్కడ రోడ్లు, విద్యుత్, నీళ్లు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలపై సెటైర్లు వేశారు. కొద్దిరోజుల క్రితం తన మిత్రుడు పండగకు పక్క రాష్ట్రం వెళ్లి వచ్చారని.. వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశారని.. అక్కడ నాలుగు రోజులు ఉండగా కరెంట్ లేదని.. నీళ్లు లేవని.. రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్లను నాలుగురోజులు బస్సుల్లో పక్క రాష్ట్రానికి పంపాలని.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం విలువ ఏంటో తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. తాను చెప్పడం కాదని.. మన వాళ్లు కూడా ఒకసారి పక్కరాష్ట్రం వెళ్లి చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.
మరోవైపు తెలంగాణను అప్పుల రాష్ట్రం అని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటంపైనా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అప్పుల తెలంగాణ అని కొందరు అంటున్నారని.. కేసీఆర్ అప్పు చేసిన డబ్బులను నీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగం కోసం ఖర్చు చేశామని.. తాము చేసే అప్పు భవిష్యత్ తరాల మీద పెట్టుబడి అవుతుందని వివరించారు. అప్పుచేసి పప్పు బెల్లాలను పంచితే తప్పు అవుతుందని.. అప్పు చేసి పునరుత్పాదక రంగాల మీద పెట్టుబడి పెడితే తప్పేంటని ప్రశ్నించారు.
Also Read
- Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
- Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
- TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
111 జీవో ఎత్తివేస్తే ఏదేదో మాట్లాడుతున్నారని.. తన కోసమే 111 జీవో ఎత్తివేశారని ఓ పిచ్చోడు మాట్లాడుతున్నారని.. ఈ జీవోను ఎత్తివేయాలని వైఎస్ఆర్ హయాంలోనే ప్రయత్నించారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి పార్టీ తాము అధికారంలోకి వస్తే 111 జీవోను ఎత్తివేస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ముందు ధర్నాలు జరిగేవని, ఇప్పుడు హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని కేటీఆర్ వెల్లడించారు. గతంలో ఏ పండుగ వచ్చినా అల్లర్లు జరిగేవి, తెలంగాణ వచ్చిన తర్వాత కుల, మత అల్లర్లు లేవని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..