Site icon NTV Telugu

KTR: నోట్ల‌పై మోడీ బొమ్మ‌ను ముద్రించాలని ఆదేశిస్తారేమో..?

Ktr

Ktr

టీఆర్ఎస్‌-బీజేపీ మధ్య వార్‌ నడుస్తూనే ఉంది.. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగడుతూ వస్తున్నారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్.. తరచూ ఆయన.. సోషల్‌ మీడియా వేదికగా.. కేంద్ర సర్కార్‌.. లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోన్న పరిణామాలను దుయ్యబడుతూ వస్తున్నారు.. ఇక, గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ట్విట్టర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్..

Read Also: Superstitious Beliefs: మూఢ నమ్మకాలతో ఊరు ఖాళీ.. తోటల్లో మకాం..

గుజరాత్‌ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లో ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును మార్చ‌డంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కేటీఆర్.. ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును న‌రేంద్ర మోడీ మెడిక‌ల్ కాలేజీగా మార్చిన‌ట్లు విమర్శలు గుప్పించిన ఆయన.. ఇప్ప‌టికే స‌ర్దార్ ప‌టేల్ స్టేడియాన్ని న‌రేంద్ర మోడీ స్టేడియంగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఇండియన్‌ కరెన్సీపై కూడా నరేంద్ర మోడీ బొమ్మ ముద్రించాలని ఆదేశాలు ఇస్తారేమో అని ఎద్దేవా చేశారు.. ఒక‌వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు అవ‌కాశం ఇస్తే, త్వ‌ర‌లో ఆర్బీఐ ముద్రించే నోట్ల‌పై నరేంద్ర మోడీ బొమ్మ‌ను వేసే అవ‌కాశాలు ఉన్నాయని.. క‌రెన్సీ నోట్ల‌పై మ‌హాత్మా గాంధీ బొమ్మ బ‌దులుగా నరేంద్ర మోడీ బొమ్మ‌ను ముద్రించినా ఆశ్చ‌ర్యం లేదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌.

Exit mobile version