టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఖమ్మం పర్యటన రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం రేపు అయన ఖమ్మంలో పర్యటించాల్సి ఉండగా.. దానిని వాయిఆ వేశారు.. ఈ- కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశం పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. కేటీఆర్ ఖమ్మం పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుంది అనేదానిపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. కాగా, ఖమ్మంలో సాయి గణేష్ అనే బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం.. ఈ నేపథ్యంలో.. మంత్రి పువ్వాడ అజయ్, పోలీసులపై బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.. శనివారం ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న విషయం తెలిసిందే.
Read Also: Sai Ganesh Demise: బీజేపీ కార్యకర్త మృతి కేసులో కీలక సాక్ష్యం.. మంత్రి టార్చరే కారణం..!