KTR US Tour: హైదరాబాద్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన బోస్టన్ సిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతిధులతో భేటీ అవుతున్నారు.. రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్ని రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, సదుపాయాలను వివరిస్తూ.. పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు.. ఇక, తాజాగా, హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చిన అమెరికాలోని బోస్టన్ సిటీ.. బోస్టన్‌లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ 2022 Health Care At a Glance సదస్సులో.. మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.. మసాచుసెట్స్ రాష్ట్రంలో జరుగుతున్న హెల్త్ రికార్డుల డిజిటలికరణ ప్రయోజనాలను వివరించారు.. ఇక, హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు బోస్టన్ నగరం సిద్ధమని ఆ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ ఈరోజు మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కి అమెరికాలోని బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ మాదిరి ఇక్కడ సైతం అనేక ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ రంగంలో అనేక నూతన పరిశోధనలు ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు.
Read Also: West Bengal: భీర్భూమ్ ఘటన వెనుక కుట్ర..? పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది అదే..!
Also Read
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్-బోస్టన్ నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాల వలన భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కేటీఆర్… తెలంగాణ ప్రభుత్వం సైతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలో పౌరుల యొక్క హెల్త్ రికార్డ్ లని డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న లైఫ్ సైన్సెస్ రంగంలోని సైంటిస్ట్‌లతో పాటు ఐటీ, టెక్ రంగాల డాటా సైంటిస్టుల చేస్తున్న ఉమ్మడి కృషి వలన రానున్న రోజుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వలన సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, ఆయా రంగాలకు ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా బయో, లైఫ్ సైన్సెస్ రంగాల్లో టెక్నాలజీకి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ లాంటి కంపెనీల కార్యకలాపాలను ఉదహరించి, హైదరాబాద్ నగరంలో ఉన్న అవకాశాలను వివరించారు. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా పేరు ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, పాలసీ పరమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫండ్ ను ఏర్పాటు చేయడం, జీనోమ్ వ్యాలీ లో ప్రత్యేకంగా ఒక ఇంకుబేటర్ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకున్నదని, వీటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ బయో లైఫ్ సైన్సెస్ ఫార్మా ఉత్పత్తులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కేటీఆర్.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!