బాసర ట్రిపుల్ ఐటీలో రెండవ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.. తరగతులు బహిష్కరించి ప్రధాన గేటు వద్దకు ఆందోళన చేయడం కోసం వస్తున్నారు విద్యార్థులు.. అయితే, విద్యార్థులను కొద్ది దూరంలోనే అడ్డుకున్నారు పోలీసులు, సెక్యూరిటీ… ఇక, ట్రిపుల్ ఐటీ నిరసనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. తమ సమస్యలపైన స్పందించాలని విజ్ఞప్తి చేసిన విద్యార్థికి సమాధానమిచ్చారాయన. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.
Read Also: Viral Video: టైగర్స్ మధ్య గ్రామ సింహం.. ఆ దర్జాయే వేరు..!
కాగా, బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కొనసాగిస్తున్నారు.. 12 డిమాండ్ల పరిష్కారం కోసం నిన్న రోజంతా కొనసాగిన విద్యార్థుల నిరసన… ఇవాళ కూడా కొనసాగుతోంది.. ఇక, విద్యార్థుల డిమాండ్ల విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి.. ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) విశ్వవిద్యాలయంలోనే ఉండి తమ విధులను నిర్వహించాలి. ఖాళీ ఉన్న పోస్టులను అతి త్వరగా భర్తీ చేయాలి.. అధ్యాపకుడు విద్యార్థుల నిష్పత్తి సమస్యని పరిష్కారించాలి.. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఆధారిత విద్యాబోధన, పీయూసీ బ్లాక్లను హాస్టళ్లను పునర్వ్యవస్థీకరించాలి.. విద్యార్థులకు మౌలిక సదుపాయాలను అందించాలి, ప్లంబింగ్, ఇంటర్నెట్, విద్యుత్ మొదలైన వనరులను సరైన రీతిలో నిర్వహించాలి.. టెండర్ల విషయంలో ఏకఛత్రాధిపత్య ధోరణి అంతమవ్వాలి.. పీఈడీ, పీఈటీ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు.
Will take all the issues mentioned to the notice of Hon’ble CM KCR Garu & Education Minister @SabithaindraTRS Garu
Kindly be assured that we are committed to resolving any challenges with respect to improving quality of education https://t.co/jNLkemAkMU
— KTR (@KTRTRS) June 15, 2022