షర్మిలకి హరీష్‌రావు కౌంటర్.. వైఎస్ వారసులకి స్థానంలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు.. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన ఆమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం అని ప్రకటించారు.. అయితే, ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు వచ్చాయన్నారు హరీష్‌రావు.. గతంలో రాజ శేఖర్ రెడ్డి.. తెలంగాణ సిగరెట్టా..? బీడీనా అని అసెంబ్లీలో అడిగారని.. మా నీళ్లు, నిధులు ఆంధ్రకు తరలిస్తున్నందుకు మీకు మద్దతు ఇవ్వాలా? అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రజల హృదయాల్లో వైఎస్ వారసులుకి స్థానం లేదని స్పష్టం చేసిన హరీష్‌రావు.. నేను బతికి ఉండగా తెలంగాణ రాదని రాజశేఖర్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు.. హైకమాండ్ మెప్పు కోసం, కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు కోసం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పనిచేవారని ఆరోపించిన ఆయన.. తెలంగాణకి అవమానం, అవహేళన చేసింది రాజశేఖర్ రెడ్డే అన్నారు.. ఇక, రాయల తెలంగాణ కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశారన్న హరీష్.. 100 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటేనే తెలంగాణ అని రాజశేఖర్ రెడ్డి చెప్పారన్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో ఎక్కువ, ప్రజల్లో తక్కువ అంటూ ఎద్దేవా చేశారు హరీష్‌రావు.. సంగారెడ్డి ఎమ్మెల్యే ఫోన్ ఎత్తడు, అవసరం అయితే కనీసం స్పందించడని ఆ పార్టీ నాయకులే చెబుతారని.. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు, కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదని సెటైర్లు వేశారు.. ఇక, జులై నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని.. త్వరలో 4 వేల కోట్లతో పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మంచినీటి కొరత, కరెంట్ కొరత ఉండేది.. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయలేనివి.. ఏడేళ్లలో టీఆర్ఎస్ చేసిందన్నారు.. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు, ప్రైవేట్ హాస్పిటల్స్ ని ప్రోత్సహించారని విమర్శించిన హరీష్.. గతంలో సంగారెడ్డికి ముఖ్యమంత్రులను తీసుకు వచ్చేవారు తప్ప అభివృద్ధి జరగలేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక లక్షా 30 వేలు ఉద్యోగాలు ఇచ్చాం.. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
తాజావార్తలు
-
Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
-
Womens T20 World Cup: పాకిస్థాన్‌పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్‌లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి ఎందుకంత భయపడుతున్నారు?
-
US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
-
Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?