NTV Telugu Site icon

70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్లలోనే..

Harish Rao

Harish Rao

70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేళ్లలోనే జరిగిందన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్ల కేసీఆర్‌ పాలనలో చేసి చూపించారని తెలిపారు.. యాసంగిలో దేశంలో అత్యధిక వరి సాగు రాష్ట్రంలో జరిగిందన్న ఆయన.. యాసంగిలో 52 లక్షలు ఎకరాల్లో వరి ధాన్యం పండించిన ఘనత మన రైతులదే అన్నారు.. కాళేశ్వరం నీటితో పంట దిగుబడి ఎక్కువ వస్తుందని రైతులు చెబుతున్నారని.. రాష్ట్రంలో ఆయిల్ పాము సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందన్నారు హరీష్‌రావు.. ఏడాదికి 60 వేల కోట్ల పామాయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం కూడా చేస్తుందన్నారు. ఇక, రాబోయే రోజుల్లో దొడ్డు వడ్లకు డిమాండ్ తగ్గుతుందన్నారు హరీష్‌రావు.