NTV Telugu Site icon

హుజురాబాద్ గెలుపు కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం.. అభివృద్ధి బాధ్యత నాది..

నిరంతరం ప్రజల కోసం పని చేసే‌ సీఎం కేసీఆర్‌కు.. ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గెలుపును కానుకగా ఇద్దాం… మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్ దేశాయిపల్లిలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు గ్రామస్తులు.. వారికి గులాబీ కండువా‌ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను బలపరుద్దాం.. కులవృత్తులను బలో పేతం‌చేసేలా‌ సీఎం‌ కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.. ఒకప్పుడు తెలంగాణ అంటే ఆత్మహత్యలు, ఆకలి కేకలు, వలసలు ఉండేవి.. ఇప్పుడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అన్నారు.. దేశంలో అత్యధికంగా వరి పంట పండించే పంజాబ్ ను వెనక్కు నెట్టి, తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందన్నారు.

ఇక, యాసంగిలో‌ 3 కోట్ల మెట్రిక్‌టన్నుల‌వరి పంట పండించి ‌తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచిందన్నారు మంత్రి హరీష్‌రావు.. ఇది‌ సీఎం‌ కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళిక వల్లే సాధ్యమైందన్న ఆయన.. ఇది అవుతుందా అన్న కాళేశ్వరం ప్రాజెక్టు ‌రికార్డ్ సమయంలో పూర్తి చేసి రైతన్నకు సాగు నీటి‌కొరత లేకుండా‌ చేశారన్నారు.. కాళేశ్వరం తొలి ఫలితం అందుకున్న నియోజకవర్గం హుజురాబాద్ అని గుర్తుచేసిన ఆయన.. నేడు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు ఎందుకు వచ్చాయో మీకు తెలుసు అని.. తన స్వార్థం‌కోసం ఈటల రాజేందర్ రాజీనామా వల్ల ఈ ఎన్నికలు వచ్చాయన్నారు.. మంత్రిగా పేదల‌ కోసం ఒక్క ఇళ్లు కట్టని ఈటల గెలిస్తే, ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఇళ్లు నిర్మించి ఇస్తారా? అని ప్రశ్నించిన ఆయన.. వ్యక్తి ప్రయోజనమా… హుజురాబాద్ ప్రజల ప్రయోజనాలా.. మీరే ఆలోచించండి అని సూచించారు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా అన్నారు మంత్రి హరీష్‌రావు.