Site icon NTV Telugu

Localbody Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం

Local Body Elections

Local Body Elections

Localbody Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, కీలక నిర్ణయాల కోసం కసరత్తు ప్రారంభించింది. శనివారం ఏర్పాటు చేసిన ఈ కమిటీ తొలి సమావేశం కాసేపట్లో జరగనుంది. ప్రజాభవన్‌లో జరిగే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు హాజరుకానున్నారు.

Dharmasthala case: భీమా పచ్చి అబద్ధాలకోరు.. మాజీ భార్య తీవ్ర ఆరోపణలు

ఎన్నికల నిర్వహణలో ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సలహాలు తీసుకునేందుకు, కమిటీ అడ్వకేట్ జనరల్‌ను కూడా సమావేశానికి ఆహ్వానించింది. ఆయన సూచనలు ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌కి సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Nellore : ఇళ్లు స్థలాలు ఇప్పిస్తానంటూ 21 కుటుంబాల నుంచి రూ.10వేల చొప్పున కాజేసిన లేడి డాన్ అరుణ

Exit mobile version