Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు హైకోర్టు ఇవ్వబోయే తీర్పుతో ఎన్నికల భవితవ్యం తేలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ జీఓ చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఈ విచారణలో స్పష్టత రానుంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ ప్రకారం, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం కలిపి మొత్తం 67 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే, సుప్రీంకోర్టు స్పష్టంగా 50 శాతం రిజర్వేషన్ పరిమితిని మించరాదని గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
Fake Liquor: ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ట్విస్ట్..
హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీఓను చెల్లుబాటు చేసినట్లయితే, స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. కానీ, జీఓను రద్దు చేసినట్లయితే ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న తరుణంలో హైకోర్టు తీర్పు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేయడం ఖాయం. స్థానిక సంస్థల ఎన్నికలలో తమ బలం నిరూపించుకోవాలని చూసే పార్టీలకు ఈ తీర్పు దిశ ఎంతో కీలకమైంది.
Diwali: దీపావళి రోజున సెలవుగా ప్రకటిస్తూ కాలిఫోర్నియా గవర్నర్ ఉత్తర్వు
