Site icon NTV Telugu

కేఆర్‌ఎంబీకి మరో లేఖ.. ఏపీని నిలువరించండి..

KRMB

KRMB

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఒకరిపై ఒకరు మరీ పోటీపడి ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఒక రాష్ట్రం విధానం.. మరో రాష్ట్రానికి నచ్చడంలేదు.. ఇంకో రాష్ట్రం అవలంభిస్తున్న వైఖరి పక్క రాష్ట్రం జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది.. తాజాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి మరో లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ రాసిన లేఖలో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్‌ నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.. అలాగే.. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును కూడా నిలువరించాలని లేఖలో పేర్కొన్నారు టీఎస్‌ ఇరిగేషన్‌ ఈఎన్సీ.. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారని.. హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించిందని.. 1976 ఒప్పందం ప్రకారం ఏపీ 34 టీఎంసీల లోపే తీసుకోవాలని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్‌సీ.

Exit mobile version