హైదరాబాద్‌లోని జలసౌధాలో ఈ నెల 9వ తేదీన గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు రెండు బోర్డుల అధికారులు.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌శాఖ అధికారులకు లేఖ రాశారారు.. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నట్టు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.. అయితే, ఆ వెంటనే గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ… కోర్టు కేసుల విచారణ ఉండటంతో ఈనెల 9న గోదావరి నదీ యాజమాన్య బోర్డు నిర్వహించ తలపెట్టిన పూర్తిస్థాయి సమావేశానికి హాజరుకాలేమని లేఖలో పేర్కొంది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. మరోవైపు.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన కోసం తెలంగాణకు చెందిన దేవేందర్ రావు అనే అధికారిని అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ కు లేఖ రాశారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.
మేం ఆ సమావేశానికి హాజరుకాలేం.. తెలంగాణ ఈఎన్సీ లేఖ

Telangana Irrigation ENC