Site icon NTV Telugu

IAS Transfers : 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ముఖ్య విభాగాలకు కొత్త నియామకాలు

Ts Gov Logo

Ts Gov Logo

IAS Transfers : తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. మొత్తం ఎనిమిది మంది అధికారులను కొత్త పదవులకు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో అభివృద్ధి, సంక్షేమం, రవాణా, గురుకుల విద్య, అర్బన్ డెవలప్మెంట్‌ వంటి విభాగాల్లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి.

అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సభ్యసాచి ఘోష్‌ను ప్రభుత్వం నియమించింది. గురుకుల సంక్షేమ శాఖ కమిషనర్‌గా అనితా రామచంద్రన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవాణా శాఖ కమిషనర్‌గా ఇలాంబర్తి నియమితులయ్యారు. జీఏడీ పొలిటికల్ ఇంచార్జి సెక్రటరీగా ఈ. శ్రీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

అదే విధంగా, యాస్మిన్ బాషాను ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్మెంట్ ఇంచార్జి సెక్రటరీగా సీఎస్ రామకృష్ణ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఎస్సీ డెవలప్మెంట్ స్పెషల్ కమిషనర్‌గా జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు ఇంచార్జి బాధ్యతలు ఇవ్వబడ్డాయి.

Muslim Countries Alliance: ఇజ్రాయెల్‌కు చెక్ పెట్టనున్న ముస్లిం దేశాల కొత్త కూటమి..?

Exit mobile version