Telangana Transfers : తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో భారీ బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ (పరిపాలనా పరమైన కారణాలు) పై ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ (Transfers and Postings) శనివారం ప్రభుత్వం అఫీషియల్ ఆర్డర్స్ జారీ చేసింది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ డి.ఎస్. జీవో (G.O.Rt.No.286) రిలీజ్ చేశారు. ఈ లేటెస్ట్ ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన అధికారులు, వారి కొత్త పోస్టింగ్స్ వివరాలు కింద ఉన్న పారాగ్రాఫ్ లో చూడవచ్చు.
కరీంనగర్ ఎస్‌డీసీ (SDC, LA) గా పనిచేస్తున్న ఎస్. కిరణ్ ప్రకాష్‌ను స్టేషన్ ఘన్‌పూర్ ఆర్‌డీఓ (RDO) గా బదిలీ చేశారు. అలాగే స్టేషన్ ఘన్‌పూర్ ఆర్‌డీఓగా పోస్టింగ్ ఆర్డర్స్‌లో ఉన్న ఆర్.వి. రాధా బాయిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (MA&UD) డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తూ.. అక్కడ నుండి కుడా (KUDA) ఎస్‌డీసీగా వన్ ఇయర్ పీరియడ్ కోసం డెప్యుటేషన్‌పై నియమించారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ ఆర్‌డీఓగా ఉన్న డి.ఎస్. వెంకన్నను పరకాల ఆర్‌డీఓగా, డాక్టర్ ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ఐటీ (Dr.MCRHRD IT) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా డెప్యుటేషన్‌పై ఉన్న ఎన్. నిర్మలను ములుగు ఆర్‌డీఓగా బదిలీ చేశారు. వీటితో పాటు ములుగు ఆర్‌డీఓగా పనిచేస్తున్న ఎన్. వెంకటేష్‌ను హనుమకొండ ఆర్‌డీఓగా ట్రాన్స్ ఫర్ చేయగా.. పరకాల ఆర్‌డీఓగా ఉన్న కె. నారాయణను తదుపరి పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని గవర్నమెంట్ స్పష్టం చేసింది.
