కోవిడ్ థర్డ్ వేవ్ కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రణాళిక… అలాగే చిన్న పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రణాళిక సమర్పించాలి అని టీఎస్ హైకోర్టు తెలిపింది. అయితే మహారాష్ట్రలో లో ఉన్న పరిస్థితులు తెలంగాణ లేవు. కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంక్షేమం, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అందజేస్తున్న కిట్ లలో స్టెరాయిడ్స్ లేకుండా చూసుకోవాలి అని తెలిపింది. బ్లాక్ ఫంగస్ బారినపడ్డ వాళ్లకోసం ప్రత్యేకంగా ఈఎన్టి హాస్పిటల్ ను కేటాయించినట్లు హై కోర్టుకు తెలిపింది ఏజీ.
ఇక హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ హాస్పటల్ లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలి. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో కూల్చివేతలు ఆపాలి. ఎలక్షన్ డ్యూటీ లో కోవిడ్ బారినపడిన పోలీసులు, టీచర్లకు కోవిడ్ వారియర్స్ తరహాలో సహాయం అందించాలి. గ్రామాల్లో మొబైల్ టెస్టులను పెంచాలి. మొబైల్ మార్కెట్, కాలనీ మార్కెట్ ఏర్పాటు చేయాలి అని హైకోర్టు సూచించింది.