High Court Postponed MLA Bribe Case To Dec 13: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసుపై నేడు హైకోర్టులో విచారణ సాగింది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ.. జగ్గూ స్వామి వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. అలాగే.. బీఎల్ సంతోష్‌కి ఇచ్చిన 41 CRPC నోటీసులపై కూడా విచారణ కొనసాగింది. ఈ సందర్బంగా.. బిఎల్ సంతోష్‌కి ఇప్పటికే పలుమార్లు అవకాశాన్ని కల్పించామని, అతనిపై ఉన్న స్టేని ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ వాదించారు. 41 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసు ప్రకారం.. సంతోష్ విచారణకు హాజరు కావాలని ఆదేశాలివ్వాలని అన్నారు.
ఈ వాదనలు విన్న అనంతరం.. 41 సీఆర్సీపీపై స్టే ఉండటం వల్ల, విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించలేమని ధర్మాసనం పేర్కొంది. పిటీషనర్ బిఎల్ సంతోష్ కుమార్‌కి సంబంధించిన వాదనలు కూడా ఇంకా వినాలని.. వాదనలు విన్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. ఇదే సమయంలో.. జగ్గుస్వామి పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆ ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది.