Site icon NTV Telugu

చెన్నమనేని పౌరసత్వం కేసు.. ఇక భౌతిక వాదనలే..!

టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరారు చెన్నమనేని తరపు న్యాయవాది వై. రామారావు.. రాష్ట్ర ప్రభుత్వo, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్‌ జనరల్ రాజేశ్వర్ రావు భౌతికంగా వాదనలు వినిపించడానికి సుముఖం వ్యక్తం చేశారు.. ఈ కేసులో.. అనేక రకమైన అఫిడవిట్‌లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున.. వాదనలకు అన్ని పార్టీలు భౌతికంగా వాదనకు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది హైకోర్టు.. అయితే, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ రావు.. ఇప్పటికే కేసు చాలా జాప్యం జరుగుతోందని, వెంటనే కోర్టు వాదనలు పూర్తి చేసి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. దీనిపై స్పందించిన హైకోర్టు.. అక్టోబర్ 21న భౌతిక వాదనలు జరుపుతామని పేర్కొంటూ.. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.

Exit mobile version