Site icon NTV Telugu

రామ‌ప్ప సంర‌క్ష‌ణ‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు…

రామ‌ప్ప‌కు యునెస్కో ప్ర‌పంచ‌వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తించిన సంగ‌తి తెలిసిందే.   అయితే, రామ‌ప్ప దేశాల‌య ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో ప్ర‌భుత్వాలు అల‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ని అనేక ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వెలువడ్డాయి.  ఈ క‌థ‌నాల‌ను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచార‌ణ చేప‌ట్టింది.  యునెస్కో విధించిన గ‌డువులోగా స‌మ‌గ్ర సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని, ఏఎస్ఐ, రాష్ట్ర పురావ‌స్తు శాఖ‌, క‌లెక్ట‌ర్ల‌తో క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని హైకోర్టు సూచించింది.  ఆగ‌స్టు 4న తొలి క‌మిటీ స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.  

Read: “మా” కాంట్రవర్సీ… రంగంలోకి కృష్ణంరాజు

క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న జ‌ర‌పాల‌ని, నాలుగు వారాల్లో క‌మిటీ నివేదిక స‌మ‌ర్పించాల‌ని హైకోర్టు ఆదేశించింది.  రామ‌ప్ప ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తింపు పొంద‌డం దేశానికి గ‌ర్వ‌కార‌ణం అని, ప్ర‌పంచ అంచ‌నాల‌కు అనుగుణంగా తీర్చిదిద్దాల‌ని హైకోర్టు పేర్కొన్న‌ది.  యునెస్కో గ‌డువులోగా కార్యాచ‌ర‌ణ చేప‌ట్టి శాశ్వ‌త గుర్తింపు ద‌క్కించుకోవాల‌ని, అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తే దేశ‌మంతా నిందిస్తుంద‌ని హైకోర్టు పేర్కొన్న‌ది. రామ‌ప్ప అభివృద్ది అంశాన్ని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తామ‌ని హైకోర్టు తెలియ‌జేసింది.  ఇక త‌రుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 25 కి వాయిదా వేసింది.  

Exit mobile version