Site icon NTV Telugu

Gangula Kamalakar: గంగులకు హైకోర్టులో ఊరట.. పొన్నం పిటిషన్ కొట్టివేత

Gangula Kamalakar

Gangula Kamalakar

Gangula Kamalakar: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు బుధవారం హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఈరోజు తిరస్కరించింది. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చేశారంటూ గంగుల కమలాకర్ పై పొన్నం ప్రభాకర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్నది. సరైన ఆధారాలు లేని కారణంగా పొన్నం ప్రభాకర్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ విజయం సాధించారు. అయితే గంగుల కమలాకర్ నిర్దేశించిన ఎన్నికల ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చేశారంటూ తెలంగాణ హైకోర్టులో పొన్నం ప్రభాకర్ పిటిషన్ వేశారు. పొన్నం ప్రభాకర్ పిటిషన్‌ను తిరస్కరించారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా గంగుల కమలాకర్‌పై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఈ ఏడాది ఆగస్టులో తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. గంగుల కమలాకర్‌పై బండి సంజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ జరుపనున్నట్లు తెలంగాణ హైకోర్టు ఈరోజు ప్రకటించింది.
Fake Chocolates: రాజేంద్రనగర్ లో కల్తీ చాక్లెట్స్ తయారీ

Exit mobile version