BC Reservations : తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్లపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలపై ఈ పిటిషన్లు వేశారని ప్రశ్నించింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికా కటింగ్స్‌ను ఆధారాలుగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమంటూ ఇటీవల రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వలు ఈ పిటిషన్లు వేశారు.
GST Impact in AP: జీఎస్టీ ప్రభావంతో ఏపీలో వాహనాలకు పెరిగిన గిరాకీ.. ఒక్క రోజులో ఎన్ని కొన్నారంటే..?
ప్రభుత్వం 42% రిజర్వేషన్లతో పాటు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రయత్నిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు వాదించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే నిబంధనను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అందువల్ల పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టును ఆశ్రయించారు. కానీ, ఈ వాదనలకు న్యాయపరమైన బలమేదీ లేదని హైకోర్టు స్పష్టం చేసి, పిటిషన్లను కొట్టివేసింది.
Nimmala Ramanaidu: కూతురు పెళ్లిలోనూ పసుపు చొక్కానే ధరించిన మంత్రి.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్య..
