Site icon NTV Telugu

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు షాక్.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..

Sreenivas Goud

Sreenivas Goud

Srinivas Goud: తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో షాక్ ఇచ్చింది. తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలన్న మంత్రి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మంత్రిపై మహబూబ్ నగర్ ఓటరు రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు అనుమతి లభించింది. ఎన్నికల అఫిడవిట్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారంటూ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మంత్రి వాదనను తోసిపుచ్చి రాఘవేంద్రరాజు పిటిషన్‌పై విచారణకు అనుమతించింది.

Read also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో అత్యంత సమీప అభ్యర్థి జలగం వెంకటరావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించి సంచలన తీర్పు ఇచ్చారు. వనమా విజయంపై జలగం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఆస్తులను సక్రమంగా ప్రకటించలేదన్న ఆరోపణలున్నాయి. ఇవి నిజమని గుర్తించిన కోర్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే..
1969 Postcard: 1969లో పంపిన పోస్ట్‌కార్డ్‌ ఇప్పుడు డెలివరీ.. మొదటి లైను చదవగానే షాక్

Exit mobile version