Site icon NTV Telugu

Weather Updates : కాసేపట్లో తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

Mumbairain

Mumbairain

Weather Updates :  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది.

Vijayawada : శరవేగ పనులు..విజయవాడ బైపాస్ రోడ్డు 85% పూర్తి, సంక్రాంతి నాటికి ట్రాఫిక్ సమస్యలకు బైబై !

రాగల మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరించింది. అంతేకాకుండా, ఈనెల 25వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు.

 

ఆ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి, వాయవ్య దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతం సమీపంలో ఈనెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించారు. ఈ వాయుగుండం సెప్టెంబర్ 27 నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని సూచించింది

PM Modi: ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version