Site icon NTV Telugu

Telangana Rains: తెలంగాణలో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు…

Telangana Rains Today

Telangana Rains Today

Telangana Rains: రాష్ట్రంలో వర్షాల పరిస్థితి మరింత తీవ్రమవుతున్న నేపధ్యంలో, వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఉధృతమవుతుందని అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం, బంగాళాఖాతంలో ఆగస్టు 13 (బుధవారం) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఉత్తర అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కి.మీ ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మంగళవారం (ఆగస్టు 13) రోజున తెలంగాణలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. అదే విధంగా ఆదిలాబాద్, జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాల అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొన్నారు.

Sruthihasson : అందుకే నాకు బ్లాక్‌ కలర్ అంటే ప్రాణం..

బుధవారం (ఆగస్టు 14) రోజున మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాల హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

వాతావరణ శాఖ అధికారులు, రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు విస్తారంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేకించి రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో నివసించే ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచించారు.

Tollywood Bundh : 10వ రోజుకు చేరుకున్న టాలీవుడ్ బంద్.. ఈ రోజు సమ్మె విరమణకు ఛాన్స్

Exit mobile version