Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
- ఆదిలాబాద్‌లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- ఐఎండీ హెచ్చరిక.. 47 డిగ్రీలకు చేరే అవకాశం
- ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
- వడదెబ్బపై జాగ్రత్తలు పాటించాలని సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heatwave Alert : తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్‌లో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్‌లోనే అత్యంత వేడి రోజుగా నిలిచింది. అయితే రాబోయే రెండు రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని, ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసాధారణంగా పెరుగుతున్న ఈ వేడిని పరిగణనలోకి తీసుకున్న ఐఎండీ, రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరంభీమ్, నిర్మల్, జగిత్యాల మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. ఈ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నప్పటికీ, స్థానికంగా ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ వర్షాలు వేడి నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయని ప్రజలు ఆశించినప్పటికీ, రాబోయే 48 గంటలు మాత్రం రాష్ట్రానికి అత్యంత కీలకం కానున్నాయి. ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?