Site icon NTV Telugu

Damodara Raja Narasimha : వైద్య సేవల పరంగా ప్రభుత్వం వేగంగా ముందడుగు.. అత్యాధునిక యంత్రాలు, ఫర్నీచర్ కొనుగోలు..

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha : తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై మరింత దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్తగా నిర్మితమవుతున్న టిమ్స్ హాస్పిటల్స్‌తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. పేషెంట్లు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో, వారి అవసరాలకు తగ్గట్లుగా ఫర్నీచర్, మెడికల్ పరికరాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్న తరుణంలో, పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, మెడిసిన్ నిల్వలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని మంత్రి అధికారులకు స్పష్టంగా చెప్పారు. కనీసం మూడు నెలలకు సరిపడా మందులు సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో నిల్వ ఉండేలా చూడాలని టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులకు సూచించారు.

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు కేరళ సర్కార్ రాచమర్యాదలు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి!

ప్రతి పీహెచ్‌సీలో పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి, 24 గంటల్లోగా రిపోర్టులు అందించే విధంగా టెస్టింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఒక్కో పరీక్ష కోసం పేషెంట్లు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదన్నారు. డయాగ్నస్టిక్స్ హబ్‌లలో అన్నిరకాల టెస్టులు, స్కాన్ల సౌకర్యం అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

ప్రతి మెడికల్ కాలేజీలో సీటీ స్కాన్ యంత్రాలు ఇప్పటికే అందుబాటులోకి తీసుకురాగలిగామని, ఇప్పుడు ఎంఆర్‌ఐ యంత్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. వీటి కొనుగోలు, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో మెడిసినల్ స్టోర్లను ఏర్పాటు చేశామని, వాటికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించామని మంత్రి వెల్లడించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Quantum Valley Declaration: క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్‌కు ఆమోదం.. ప్రభుత్వం ఉత్తర్వులు

Exit mobile version