NTV Telugu Site icon

Seasonal Diseases and Food: ఈ సీజన్‌లో ఈ ఫుడ్‌కు దూరంగా ఉండండి..!

Food

Food

రెయిన్‌ సీజన్‌ ప్రారంభమైంది.. పరిసరాలు అన్నీ మారిపోయాయి.. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిసర ప్రాంతాల్లో చిత్తడిగా మారిపోయాయి.. ఇదే సమయంలో.. డెంగ్యూ, టైఫాయిడ్‌ ఇతర సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుండడం.. మరోవైపు సీజనల్‌ వ్యాధులు విజృంభణతో.. ఏది వైరస్‌, ఏది సీజనల్‌ అనే తెలియని పరిస్థితి నెలకొంది.. అయితే, కరోనాతో భయపడాల్సిన పనిలేదని అంటున్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు.. కరోనా వచ్చిన ఐదు రోజులు క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందన్న ఆయన.. ఆస్పత్రులో చేరాల్సిన అవసరం లేదన్నారు. ఇక, వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

Read Also: Bonalu Festival 2022: బోనాలకు ముందే ఆలయాలకు ఆర్ధిక సహాయం..

మరోవైపు, అంటువ్యాధులు ప్రభలకుండా పబ్లిక్‌ ప్రాంతాల్లో లభించి ఫుడ్‌ను తీసుకోవద్దని సలహా ఇచ్చారు శ్రీనివాస్‌రావు.. డెంగ్యూ కంటే టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్న ఆయన.. టైఫాయిడ్ కలుషిత జలాలతో వ్యాపిస్తుందన్నారు.. ఇక, పానీపూరి, తోపుడు బండ్లపై ఈగలు, దోమలు వాలే పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.. వాటితో సీజనల్‌ వ్యాధులు మరింత విజృంభించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు.. ప్రయివేట్ ఆస్పత్రులు వ్యాపార ధోరణితో అనవసర టెస్ట్ లు చేయించవద్దని వార్నింగ్‌ ఇచ్చారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు.